జనసేనకెన్ని, కామ్రేడ్లకెన్ని? తెలంగాణాలో తేలనున్న లెక్క!

ముందస్తు ఎన్నికలు రావడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, ఈ క్రమంలో విపక్ష పార్టీలు ఒకే తాటి మీదకు వచ్చి కూటమిగా ఏర్పడేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో జనసేన పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

సీట్లు ఖరారు కాగానే రేపో మాపో పొత్తుపై ఓ ప్రకటన చేయనున్నాయి. ఐతే, కూటమిలో సీపీఎం, జనసేన పార్టీలు లేవు. ఈ రెండు పార్టీలు ఎటువైపు అన్నది అసలు ప్రశ్న. మరోవైపు ఆదివారం సీపీఎం- జనసేన నేతలు సమావేశయ్యారు. మళ్లీ ఈ రెండు పార్టీల నేతలు మంగళవారం లేదా బుధవారం భేటీ కావాలని భావిస్తున్నారు. ఈలోగా కూటమి నుంచి ఏదైనా ప్రకటన వచ్చే ఛాన్స్ వుంది. ఒకవేళ పొత్తు కుదిరితే సీపీఎంతో కలిసి పోటీ చేయాలని, లేదంటే ఒంటరిగా బరిలోకి దిగాలని ఆలోచన చేస్తోందట జనసేన. సీపీఎం మాత్రం కూటమి వైపు మంతనాలు జరుగుతున్నట్లు వార్తలు  వెలువడుతున్నాయి. కాకపోతే సీట్ల దగ్గర తేడా వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి రేపటిలోగా ఎవరు ఎటన్నది తేలిపోనుంది.

READ ALSO

Related News