నవంబర్‌ థర్డ్‌వీక్‌లో ఎన్నికలు

తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నవంబర్ మూడోవారంలో జరిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. వీటిని ముందుకు, వెనక్కి జరిపే ఛాన్స్ లేదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రాష్ర్టాలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మిజోరాం శాసనసభలకు నవంబర్ 11 నుంచి డిసెంబర్ 4 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది.

తెలంగాణలో మార్చి 5 లోగా ఎన్నికలు నిర్వహించాల్సివున్నా, నాలుగు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యంలో ఆ తీర్పు ప్రభావం తెలంగాణపై పడే అవకాశముందని భావించిన ఈసీ, ఆయా రాష్ర్టాలతో ఇక్కడ కూడా పోలింగ్ నిర్వహించాలన్నది ప్లాన్. ఛతీస్‌గఢ్‌లో నవంబర్ 11, 19 తేదీల్లో పోలింగ్ జరగవచ్చని, పొరుగు రాష్ర్టమైన తెలంగాణలోనూ సమీప తేదీల్లోనే ఎన్నికలు రావచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కన నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికలు జరగవచ్చన్నది ఓ అంచనా!

Related News