సీట్లపై లీకులివ్వడం తగదు, కాంగ్రెస్‌పై చాడ ఫైర్

కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై మహాకూటమిలో వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే కోదండరామ్ తన నిర్ణయాన్ని ప్రకటించగా, ఇప్పుడు సీపీఐ వంతైంది. సీట్ల సర్దుబాటులో తాము కోరిన విధంగా కేటాయింపు లేకపోతే తామే ఓ నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి.

సీట్ల కేటాయింపు సంఖ్యపై తమకు రెండు మూడు సీట్లు కేటాయిస్తున్నామని మీడియాకి లీకులు ఇస్తున్నారని, వాళ్లెవరో బయటకు రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, మహాకూటమిలో సీట్ల కేటాయింపు విషయంపై 21న జరిగే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

Related News