తెలంగాణ కాంగ్రెస్ ‘పొత్తు’.. రాహుల్ కీలక సవరణలు!

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కీలక సూచనలు చేశారు. నేతలు రాజధానిలో మకాం వేయకుండా వీలైనంత త్వరగా క్షేత్రస్థాయికి వెళ్లాలని గట్టిగానే చెప్పారు. టీఆర్ఎస్ వైఫల్యాలు చాలానే వున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా ఓటర్ల తొలగింపు వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన.. ఈ విషయంలో నేతలకు దిశానిర్ధేశం చేశారు.

దళిత, మైనార్టీ ఓటర్లు పార్టీకి దగ్గరవుతున్న నేపథ్యంలో ఆయా వర్గాల ఓట్లను అకారణంగా తొలగిస్తున్నారని, దీనిపై నేతలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లడానికి అవసరమైన కసరత్తు పూర్తి చేశామనీ, త్వరలోనే సుప్రీంకోర్టుకు వెళ్తామని రాహుల్‌కి నేతలు వివరించారు.

ఇక పొత్తులపై నేతల మధ్య చర్చకు వచ్చింది. కలిసివచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా.. పార్టీ అభ్యర్థులు గెలిచే స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని మరోమారు సూచించారు. ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Related News