మరోసారి నోటీసు, 24 గంటల్లోగా..

తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం మరోసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోదండరెడ్డి నేతృత్వంలో సుమారు రెండు గంటలపాటు గాంధీభవన్‌లో సాగిన భేటీలో రాజగోపాల్‌ రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘనపై లోతుగా చర్చించారు. 24 గంటల్లోగా జవాబు ఇవ్వాలని కమిటీ తాజాగా ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వని పక్షంలో తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన ఎలక్షన్ కమిటీలపై రాజగోపాల్‌‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే! నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మీడియా ముందు ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టింది కమిటీ. తొలుత జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై ఆయన ఇచ్చిన మూడు పేజీల వివరణకు కమిటీ సంతృప్తి చెందలేదు.

READ ALSO

Related News