మహాకూటమి అభ్యర్థులు తేలాకే..!

ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యర్థి పార్టీలకన్నా ముందే రెడీ అయిన తెరాస అధినేత కేసీఆర్.. మిగతా 14 సీట్లకు అభ్యర్థులను ఆచితూచి ఖరారు చేసే పనిలో ఉన్నారు. మహాకూటమి అభ్యర్థులు ఎవరో తేలాకే తమ పార్టీ క్యాండిడేట్స్ ను ఆయన ప్రకటించే అవకాశం ఉంది.

వరంగల్ తూర్పు, చొప్పదండి, మల్కాజ్ గిరి, వికారాబాద్, మేడ్చల్, అంబర్ పేట, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, హుజూర్ నగర్, కోదాడ, జహీరాబాద్, చార్మినార్, మలక్ పేట స్థానాలకు తెరాస అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గోషామహల్ సీటుకు మాజీ మంత్రి, తెరాసలో చేరిన దానం నాగేందర్ పేరు ఖరారయిందని వార్తలు వస్తున్నా, అయన ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏమైనా… పెండింగు లో ఉన్న ఈ సీట్ల విషయం తేలేందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చు.

Related News