హీరోని టార్చర్ పెట్టిన అనుపమ

సాయి‌ధరమ్‌తేజ్- అనుపమ పరమేశ్వరన్ జంటగా రానున్న మూవీ ‘తేజ్.. ఐలవ్ వ్యూ’. విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ వేగవంతం చేస్తోంది యూనిట్. తాజాగా ‘నచ్చుతున్నాదే’ అనే పాట ప్రోమోని రిలీజ్ చేసింది. సాంగ్ విజువలైజేషన్ అద్భుతంగా ఉంది.. తేజ్‌ను హీరోయిన్ అనుపమ వేధించడం… ఆమె ప్రేమ పొందడం కోసం హీరో పడిన తిప్పలు.. ఈ తరహా సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమలో కొత్త వేరియేషన్స్ చూపించే కరుణాకరన్.. మరోసారి అదే ప్రయత్నం చేశాడు. మూవీని జూలై ఆరున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

Related News