తప్పైంది.. క్షమించండి: మురళీమోహన్‌

బుధవారం రాజమండ్రిలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఎంపీ మురళీమోహన్‌ మాటతూలారు. కర్ణాటకలో బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించే క్రమంలో మా ‘వెంకన్న చౌదరి’ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందంటూ టంగ్ స్లిప్ అయ్యారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తుండటంతో వీడియో రూపంలో శుక్రవారం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజమండ్రిలో ఒక మీటింగ్‌లో పొరపాటున ‘వెంకన్న చౌదరి’ అన్నాను.

అప్పటిదాకా బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని ‘చౌదరిగారూ.. చౌదరిగారూ..’ అని మాట్లాడుకున్నాం. వెంకన్న చౌదరి అనడం టంగ్‌ స్లిప్పే తప్ప.. దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కానని మురళీ మోహన్ అన్నారు. ఈ ఉదయం పూజ చేసేటప్పుడు కూడా దేవుడికి మొక్కుకున్నా.. టంగ్‌ స్లిప్‌ అయింది స్వామి.. పొరపాటుగా అన్నాను.. కావాలని అనలేదు..క్షమించండి అని దేవుడికి దండం పెట్టుకున్నానని మురళీమోహన్‌ వివరణ ఇచ్చుకున్నారు.

Related News