ఇది బీజేపీ కుట్ర.. టీడీపీ

జమిలి ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు టీడీపీ ఎంపీలు తోట నరసింహం, కనకమేడల రవీంద్రకుమార్. ఇది బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమన్నారు. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమంటూ లా కమిషన్‌కు తమ అభిప్రాయాన్ని తెలిపినట్టు వారు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలను అస్థిర పరచేందుకు భారతీయ జనతా పార్టీ ఈ కుట్ర చేస్తోందన్నారు. ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి కేంద్రం రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోందని వారు దుయ్యబట్టారు.

జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం. లోక్ సభ ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నా..అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా లేము.. అని తాము స్పష్టం చేసినట్టు తోట నరసింహం, కనకమేడల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు.

Related News