గుంపు పోటెత్తితే..హీరో గాయపడ్డాడు

తమిళ సూపర్ స్టార్..ఇళయదళపతి..విజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. పుదుచ్చేరిలో మాజీ ఎమ్మెల్యే, తన అభిమాన సంఘం అధ్యక్షుడు కూడా అయిన ఆనంద్ కూతురి వివాహానికి ఆయన హాజరు కాగా.. ఈ హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. భారీ సంఖ్యలో వచ్చిన వీరినుంచి తప్పించుకునేందుకు విజయ్ నానా తంటాలు పడ్డాడు. ఇతని సెక్యూరిటీ కూడా గుంపును అదుపు చేయలేక చేతులెత్తేశారు. తొక్కిసలాట జరిగినంత పనయింది. తోపులాటలో విజయ్ కింద పడిపోబోగా అతని కాలికి గాయమైంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి..అతని అభిమానులపై లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ వివాహానికి విజయ్ కూడా వస్తున్నాడని ఆనంద్ ముందే అభిమానులందరికీ సమాచారం ఇవ్వడమే ఇంత రభసకు కారణమని తెలిసింది.

Related News