గోబ్యాక్ అమిత్ షా.. చెన్నైకి వస్తే చితకేస్తాం..!

‘తూత్తుకుడి’ దెబ్బ సరిపోలేదా.. మా గడ్డ మీద అడుగుపెడితే ఏమవుతుందో తెలీడం లేదా.. అంటూ బీజేపీ అగ్రజులకు బహిరంగ హెచ్చరిక జారీ చేస్తోంది తమిళ నెటిజనం. మా జాతి మీద బీజేపీ పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదంటూ అక్కడి జనాభా నిప్పులు కక్కుతోంది.

దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలూ మిమ్మల్ని తిరస్కరించాయి.. ఇంకా మీకు సిగ్గు రాలేదా అంటూ తిట్టిపోస్తున్నారు. దీంతో.. సోమవారం అమిత్ షా తలపెట్టిన చెన్నై టూర్ ఉద్రిక్తంగా మారింది. జర్నలిస్టుల్ని సైతం అనుమానిస్తోంది బీజేపీ శిబిరం. ఆధార్ కార్డులుంటేనే అమిత్ షా టూర్ కవర్ చేయడానికి అనుమతిస్తామంటూ హుకుం జారీ చేసింది భద్రతా వ్యవస్థ.

తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్‌లలో బీజేపీకి జవసత్వాలు తొడగడమే లక్ష్యంగా అమిత్ షా చెన్నైలో మేథోమథనం జరపనున్నారు. రాష్ట్ర నాయకుల నుంచి బూత్ స్థాయి కార్యకర్తల దాకా అందరినీ కలిసి.. వాళ్లలో ఉత్తేజం నింపాలన్నది ఆయన స్ట్రాటజీ. కానీ.. హిందుత్వ వేర్పాటువాదులైన మీకు మా తమిళనాడులో చోటు లేదు.. వెనక్కి పోండి అనే నినాదం అక్కడ మారుమోగుతోంది. సోషల్ మీడియా అయితే.. బీజెపీ మీద ఒంటికాలితో లేస్తోంది. ‘గో బ్యాక్ అమిత్ షా’ పేరుతో ఒక హ్యాష్‌టాగ్ వీర లెవల్లో దూసుకుపోతోంది. మధ్యాహ్నానికల్లా ఈ హ్యాష్‌టాగ్ మీద 75 వేల ట్వీట్లు పోస్ట్ అయ్యాయి.

READ ALSO

Related News