స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ

హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరామునిపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటికి నిరసనగా పరిపూర్ణానంద పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించడం తెలిసిందే. కత్తి మహేష్ కు నగర బహిష్కరణ విధించి.. పరిపూర్ణానంద పాదయాత్రను అడ్డుకుని గృహనిర్భందం చేసిన హైదరాబాద్ పోలీసులు ఇప్పడు ఏకంగా నగర బహిష్కరణ వేటు వేశారు. పరిపూర్ణానందను ఇప్పటివరకూ గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు, బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లో ఉన్న పరిపూర్ణానంద నివాసం నుంచి ఆయన్ని తరలించారు. అయితే, పరిపూర్ణానందను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు.

 

పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు పద్మారావు ధృవీకరించారు. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పరిపూర్ణానందను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించారు. కొన్ని వాహనాలను విజయవాడ వైపు, మరికొన్ని వాహనాలను వేరే మార్గంలో పంపించారు.

Related News