మతం రేపిన చిచ్చు..స్వామి అగ్నివేష్‌పై దాడి

ఎనభై ఏళ్ళ సామాజిక కార్యకర్త స్వామి  అగ్నివేష్‌పై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు దాడి చేశారు. ఝార్ఖండ్‌లోని లిట్టిపాడులో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాంచీకి సుమారు 365 కి.మీ. దూరంలోని పాకూర్‌కు ఆయన మంగళవారం చేరుకున్నారు. అక్కడున్న హోటల్ నుంచి స్వామి అగ్నివేష్ బయటకు రాగానే.. బీజేపీ యువమోర్చా, విశ్వహిందూపరిషద్, ఆరెస్సెస్ లకు చెందిన కార్యకర్తలు మూకుమ్మడిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆయనకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన బట్టలు చించివేశారు. ఈయన క్రిస్టియన్ మిషనరీ సంస్థలతో కుమ్మక్కయి..గిరిజనులను క్రైస్తవులుగా మారుస్తున్నారని వారు ఆరోపించారు. ఈ దాడిలో గాయపడిన అగ్నివేష్‌ను  ఆయన సహచరులు ఆసుపత్రికి తరలించారు. తను శాంతియుతంగా ఉండే వ్యక్తినని, తనపై ఎందుకు దాడి జరిగిందో తెలియదని స్వామి  అగ్నివేష్ ఆ తరువాత అన్నారు. తన వెంట విల్లంబులు ధరించిన గిరిజనులు కొంతమంది వచ్చినంత మాత్రాన.. తను వారిని క్రిస్టియన్లుగా మార్చినట్టేనా అని ప్రశ్నించారు. అటు-సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆయనపై దాడికి పాల్పడిన వారిలో సుమారు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

READ ALSO

Related News