బక్రీద్ పై చివరివరకూ సస్పెన్స్

ముస్లింలు భక్తిప్రపత్తులతో జరుపుకునే బక్రీద్ పండుగ విషయంలో ఈ ఏడాది చివరి నిమిషం వరకూ అస్పష్టత కొనసాగింది. ఈ పండుగను ఏ రోజు జరుపుకోవాలనే అంశంపై సోమవారం వరకూ మీమాంస నడిచింది. తొలుత బక్రీద్‌ను ఈనెల 22నే జరుపుకోవాలని ప్రకటించారు. తర్వాత దానిని 23కు మార్చారు. తాజాగా ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ మాట్లాడుతూ బక్రీద్‌ను ఈ నెల 22నే జరుపుకోవాలని సూచించారు. చంద్ర దర్శనం ప్రకారం బక్రీద్‌ను బుధవారమే జరుపుకోవాలని తేల్చి చెప్పారు. దీంతో కేంద్రం కూడా బక్రీద్ సెలవును 22కు మళ్లీ మార్చాల్సి వచ్చింది.

వాస్తవానికి ఈనెల 22నే కేంద్ర ప్రభుత్వం బక్రీద్ సెలవును ప్రకటించింది. అయితే, ముస్లిం మతపెద్దలంతా కలిసి ఈనెల 23న నిర్వహించనున్నట్టు కేంద్రానికి నివేదించడంతో సెలవును 22 నుంచి 23కు మారుస్తూ ప్రభుత్వం ఇటీవల అన్ని శాఖల పరిపాలనా కార్యాలయాలకు సర్క్యులర్ పంపించింది. నిన్నటి ఢిల్లీ ఇమామ్ ప్రకటనతో మళ్లీ సెలవులో మార్పు చోటుచేసుకుంది. మరో వైపు బక్రీద్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ తోపాటు, తెలంగాణలోని పట్టణాలు, నగరాలకు భారీ ఎత్తున గొర్రెలు, మేకలు భారీ ఎత్తున దిగుమతి అయ్యాయి. ప్రధాన రహదారుల పక్కన వీటిని భారీ ఎత్తున అమ్మకానికి ఉంచారు.

Related News