‘ధోనీ’ హీరో సీక్రెట్ ఔట్.. నటితో ఛాటింగ్ డీటేల్స్

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంప‌నలు రేపుతోంది. ఈ క్రమంలో కొంద‌రి చీక‌టి కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ పేరు బ‌య‌ట‌కొచ్చింది. తాజా చిత్రం ‘కిజీ ఔర్‌ మ్యానీ’లో హీరోయిన్‌గా న‌టిస్తున్న సంజ‌నసంఘితో సుశాంత్ అస‌భ్యంగా ప్రవ‌ర్తించార‌ని, సెట్స్‌లో ఇబ్బందులు పెట్టాడ‌ంటూ వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగేశాడు ఈ హీరో. హీరోయిన్ సంజనతో ఛాట్ చేసిన మేటర్‌ని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు.

మీటూ ఉద్యమాన్ని కొంద‌రు వ్యక్తిగ‌త విష‌యాల కోసం వాడుకుంటున్నారని, ఈ క్రమంలో తనకు – సంజ‌న‌కి మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నానని రాసుకొచ్చాడు. షూటింగ్ మొద‌లు నుండి ఫినిష్ అయ్యేవ‌ర‌కు అన్నివిషయాలను షేర్ చేశాడు. ఇలా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తప్పని, కానీ, ఇలా చేయక తప్పడంలేదని వివరణ ఇచ్చాడు సుశాంత్‌. సెప్టెంబ‌ర్ నుండి త‌న ట్విట్టర్ ఖాతాకి వెరిఫైడ్ మార్క్ లేదని గుర్తుచేశాడు.

 

Related News