అద్దాల మేడ దిగి.. అందరితో కలిసి..

కష్టమొచ్చినప్పుడు చెయ్యీ చెయ్యీ కలిపి సాయం చేయడంలో వున్న సంతృప్తి మరొకటి లేదంటోంది ఆ పెద్ద మేడమ్. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి మాటలే కాదు.. చేతలు కూడా గొప్పగానే ఉంటాయి.

ప్రస్తుతం కర్ణాటకలోని కొడగు జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితిపై చలించిన ఆమె.. నేరుగా రంగంలో దిగేశారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఉంటూ.. పనివాళ్లను పెట్టి సహాయకచర్యల్ని కానిస్తూ.. తాను కూడా పనిలో దిగి.. బాధితులకు బాసటగా నిలిచారు. ఆహారపొట్లాల అందజేతలో ముందు నిలబడి ఆమె చేస్తున్న కష్టం.. ఆమెను మళ్ళీ ఇలా వార్తల్లో నిలబెట్టింది.

వేలకోట్ల విలువైన కంపెనీలో భాగస్వామ్యం వుండి.. బాగా చదువుకుని.. అనేక భాషల్లో కవయిత్రిగా కూడా రాణించిన సుధామూర్తి.. అరుదైన దాతృత్వాన్ని కూడా చాటుకుంటున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆరోగ్య విభాగంలో సైతం ఆమె సభ్యురాలుగా వున్నారు. అద్దాల మేడ దిగి.. ఇలా అందరి మధ్యలోకొచ్చి కష్టం పంచుకోవడం అనేది ఆమెలాంటి వాళ్లకు మాత్రమే సాధ్యం.

 

Related News