‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్!

సుమంత్- సంతోష్ జాగ‌ర్లపూడి కాంబోలో రానున్న ఫిల్మ్ ‘సుబ్రహ్మణ్యపురం’. షూట్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది యూనిట్. ఇందులో సుమంత్ నాస్తికుడిగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో కనిపిస్తున్నాడు. దేవుడిపై నమ్మకంలేని ఓ నాస్తికుడు దైవ సంకల్పంతో తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే విష‌యాల‌ చుట్టూనే స్టోరీ తిరుగుతోందని సమాచారం.

భక్తుల్ని అనుగ్రహించి వాళ్ల కోరికలు తీర్చాల్సిన దేవుడే ఆగ్రహించడానికి కారణమేమిటి? వంటి అంశాలను ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ సంతోష్. టీజ‌ర్‌కు మాంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచ‌నాలే నెలకొన్నాయి. ఈషారెబ్బ, తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Related News