కాలేజీ సిబ్బంది వేధింపులు తాళలేక..

కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సూర్యాపేటకు చెందిన స్నేహ సూర్య అనే విద్యార్థి చైతన్యపురి పీ.ఎస్. పరిధి టెలిఫోన్ కాలనీలోని  నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ సిబ్బంది వేధింపులు, టార్చర్ తట్టుకోలేక తన ఊళ్ళో ఇంటిపై నుంచి  దూకి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో అతని కాలు విరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు కాలేజీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

Related News