ట్రంప్‌తో ఎఫైర్ ముగిశాక స్ట్రిప్ క్లబ్‌లో..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఎఫైర్ సాగించిందన్న వార్తలతో పతాక శీర్షికలకెక్కిన పోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్ (స్టార్మీ డేనియల్స్) మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఓహియోలోని ఓ స్ట్రిప్‌క్లబ్‌లో స్ట్రిప్‌డ్యాన్స్ చేసి పోలీసులకు పట్టుబడింది. ముగ్గురు పోలీసు అధికారులపట్ల అసభ్యంగా ప్రవర్తించిందనే ఆరోపణపై ఆమెను అరెస్టు చేశారు.

ఓహియోలోని సైరెన్స్ జెంటిల్‌మన్‌ క్లబ్ అనే ఈ క్లబ్‌లో.. నిబంధనలకు పెద్ద పీట వేస్తారు. పేరుకు ఇది స్ట్రిప్ క్లబ్బే అయినా కస్టమర్ల పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించరాదట. స్టెఫానీ క్లిఫార్డ్‌ను అరెస్టు చేసి జాక్సన్‌పైక్ జైలుకు తరలించినప్పటికీ.. ఆ తరువాత విడుదల చేశారు. ఏమైనా.. తన క్లయింటు అసభ్యంగా ప్రవర్తించలేదని.. అది ‘నాన్-సెక్సువల్ ‘ అని ఆమె తరఫు లాయర్ మైఖేల్ అవెనట్టి అంటున్నారు. ఆమె అరెస్టు రాజకీయ దురుద్దేశంతో కూడినదని ఆరోపించారు. బోగస్ ఆరోపణలు ఎందుకు చేస్తారు అని ప్రశ్నించారు.

Related News