బుడ్డ తారక్.. రేపే ఫస్ట్‌లుక్!

నందమూరి మూడో తరం మరింతగా చిగురిస్తోంది. తారక్-ప్రణతి జంటకు రెండో సంతానం కలిగింది. ‘మా కుటుంబం పెద్దదవుతోంది.. ఈసారీ మగపిల్లాడే’ అంటూ తారక్ చేసిన ట్వీట్ ఆయన ఫ్యామిలీతో పాటు.. అభిమానుల్ని సైతం మురిపించింది. తల్లీ బిడ్డ క్షేమమంటూ తారక్ చెప్పిన శుభవార్త.. నందమూరి కుటుంబం మొత్తాన్నీ ఆనందంతో ముంచెత్తింది. తారక్- లక్ష్మిప్రణతిల పెళ్లి 2011 మేనెలలో జరిగింది. వీళ్ళ మరో కొడుకు అభయ్ రామ్ కి ఇప్పుడు నాలుగేళ్లు. అభయ్ ఆడుకోడానికి బుల్లి తమ్ముడు దొరికాడన్నమాట!

టాలీవుడ్ కొలీగ్స్ నుంచి తారక్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే తారక్ అభిమానులు తమ ఆనందాన్ని తమతమ క్రియేటివిటీతో అనేక రకాలుగా ఎక్స్ పోజ్ చేసుకుంటున్నారు. చిన్నోడి ఫోటో రివీల్ చేయాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

Related News