‘విజేత’పై జక్కన్న కామెంట్?

మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్ డెబ్యూ మూవీ ‘విజేత’కు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. హీరో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, సక్సెస్‌ఫుల్ బేనర్, సెన్సిటివ్ స్టోరీలైన్ లాంటివన్నీ కలిపి సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపెడుతున్నట్టు రివ్యూలు చెబుతున్నాయి. అటు.. మెగా ఫ్యామిలీ బలమైన ఆశీర్వాదంతోనే ‘బరి’లోకి దిగిన కళ్యాణ్‌దేవ్ పెర్ఫామెన్స్ మీద మాత్రం ఎవ్వరూ ‘ఎక్కువ’గా మాట్లాడకపోవడం గమనార్హం. నటన పరంగా రాణించాడని, ఫామిలీ ఆడియెన్స్‌ని మెప్పించాడని ఏ ఒక్కరూ చెప్పకపోవడం ఆసక్తికరంగా మారింది. కనీసం మెగా ఫ్యాన్స్ నుంచి కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ కనిపించలేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిది సైతం అదే శైలి. ట్రైలర్‌ని, పాటల్ని, సినిమా కంటెంట్‌ను ప్రశంసిస్తూ రిలీజ్‌కు ముందే పొడవాటి ట్వీట్ చేసిన జక్కన్న.. కనీసం హీరో కళ్యాణ్‌దేవ్ పేరు కూడా ప్రస్తావించలేదు. గుండెలకు హత్తుకునేలాంటి తండ్రీకొడుకుల కథతో ముందుకొస్తున్న వారాహి చలన చిత్ర బేనర్‌కి ఆల్ ది బెస్ట్.. అంటూ విష్ చేసిన రాజమౌళి.. సినిమా చూసిన తర్వాత ఏమంటారో చూద్దామని అటు మెగా ఫ్యామిలీ, ఇటు సోషల్ మీడియా వేయికళ్లతో ఎదురుచూస్తోంది.

 

Related News