కృష్ణమ్మ పరవళ్లు.. ఏరియల్ వ్యూ.. చూసి తీరాల్సిందే!

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో తెలుగు రాష్ర్టాల రైతులు ఊపిరిపీల్చుకున్నారు. శనివారం నాలుగు గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. బిరబిర పరుగులెడుతున్న కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు శ్రీశైలంకి పోటెత్తారు.

ఆదివారం సెలవు కావడంతో టూరిస్టులు, భక్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో శ్రీశైలంకి వెళ్లే ఘాటు రోడ్ అంతా వాహనాలతో బిజీగా మారింది. ఈ దృశ్యాలు డ్రోన్ కెమెరాలకు ఎక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటిని చూద్దాం.

Related News