ఆమె కనిపిస్తే చెప్పుతో కొట్టండి!

‘కాస్టింగ్ కౌచ్’ సెన్సేషన్ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హద్దులు మీరుతుండడంపై అన్ని కార్నర్స్ నుంచి విమర్శలు పడిపోతున్నాయి. ఆమెకేం కావాలో ఆమెకే తెలీడం లేదని, తన పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇండస్ట్రీని బద్నామ్ చేస్తోందన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. టాలీవుడ్‌లో అనేకమందిని ఇబ్బంది పెట్టి లీగల్ నోటీసుల దాకా వెళ్లిన శ్రీరెడ్డి వ్యవహారం ఇప్పుడు కేరాఫ్ అడ్రస్‌ని కోలీవుడ్‌కి మార్చేసుకుంది. తాజాగా శ్రీరెడ్డి చేస్తున్న ఫేస్‌బుక్‌ పోస్ట్‌లపై హీరో కార్తి స్పందించాడు. ఆధారాలుంటే కేసు పెట్టాలి తప్ప ఇలా రచ్చకెక్కడం సమంజసం కాదని, నడిగర్‌ సంఘం త్వరలో స్పందించి అధికారిక ప్రకటన జారీ చేస్తుందని కార్తీ అంటున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీరెడ్డి తీరుపై తెలుగు నటుడు పింగ్ పాంగ్ సూర్య కాసింత ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు. ఒక వెబ్‌ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె కనబడితే చెప్పుతో కొట్టాలి అంటూ చెప్పు చూపించి మరీ చెప్పేశాడు. ఆమెను ఆమె చెప్పుతో కొట్టుకోవడం కాదని, జనమే ఆమెను చెప్పుతో కొట్టే రోజు వస్తుందని యితడు చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

Related News