రకుల్‌తో పాటు 36 మంది.. ‘భామాకలాపం’.. కొత్త కథ?

శ్రీరెడ్డి మళ్ళీ చెలరేగిపోయింది. కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్‌లో ‘వన్ అండ్ ఓన్లీ’గా పెర్ఫామ్ చేసి టాలీవుడ్, మీడియాలతో పాటు ప్రభుత్వాల్ని కూడా కదిలించిన శ్రీరెడ్డి.. ఇప్పుడు అమెరికాలో బైటపడ్డ సెక్స్ రాకెట్ ఇష్యుని కూడా ‘టేకప్’ చేసింది. ఎబ్రాడ్ ‘పింప్’ అంటూ కిషన్ మోదుగుమూడి అనే అతడి చుట్టూ తిరిగేస్తున్న ఈ ‘భామాకలాపం’ వ్యవహారాన్ని శ్రీరెడ్డి కొత్త మలుపు తిప్పేసింది. అమెరికాలో తెలుగు సంఘాలకు సైతం తలఒంపులు తెచ్చిపెట్టి.. ఇక్కడున్న టాలీవుడ్ సినిమా ఫిమేల్ సెలబ్రిటీలకు వీసాలు నిరాకరించేదాకా ఎదిగిపోయిన ఈ రొచ్చును.. ఇప్పుడు శ్రీరెడ్డి ఒక్క సోషల్ మీడియా పోస్ట్‌తో మరో కీలక మలుపు తిప్పేసింది.

ఏకంగా 36 మంది గ్లామరస్ పర్సనాలిటీల పేర్లను సూచిస్తూ.. ‘వీళ్ళు ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలరు’ అంటూ కామెంట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇందులో కాజల్, త్రిష, శృతిహాసన్, రకుల్ లాంటి పేరుమోసిన టాప్ హీరోయిన్స్‌తో పాటు.. శ్యామల, మృదుల, లాస్య, శ్రీముఖి లాంటి టీవీ యాంకర్స్, మరికొందరు ఫిమేల్ సింగర్స్ పేర్లు కూడా వున్నాయి. వివరణ ఏమీ ఇవ్వకుండా శ్రీరెడ్డి సూచించిన వీళ్ళందరికీ వున్న సారూప్యత ఏమిటి? వీళ్ళందరూ ఏం చేశారని శ్రీరెడ్డి భావిస్తోంది.. లాంటి సందేహాలు నెటిజన్ల బుర్రల్ని కెలికేస్తున్నాయి.

కాస్టింగ్ కౌచ్ అంశంలో తన వైఖరితో విభేదించినందుకు రకుల్ ప్రీత్ సింగ్‌ని ఇంతకుముందే ఏకిపారేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు మళ్ళీ రకుల్ టార్గెట్‌గా శ్రీరెడ్డి మరో ఎటాక్ షురూ చేసింది. అప్పుడు అమెరికాలో కిషన్ మోదుగుమూడికి నువ్వెందుకు థాంక్స్ చెప్పినట్లు.. అని ప్రశ్నిస్తూ రకుల్ ఫోటోని పెట్టింది. ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్‌లో మరో రచ్చకు తావిచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related News