షాకింగ్ న్యూస్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు వుమెన్ క్రికెటర్లు

సౌతాఫ్రికాకి చెందిన ఇద్దరు వుమెన్ క్రికెటర్లు మ్యారేజ్ చేసుకున్నారు. ఒకరు మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నైకెర్క్‌ కాగా, మరొకరు ఆల్‌రౌండర్‌ మరి జన్నీ కాప్‌. వివాహ బంధంతో శనివారం వీళ్లు ఒకటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి జట్టుసభ్యులు కొందరు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. డేన్‌తో మ్యారేజ్ జరిగినట్టు కాప్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేసింది. మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకున్న రెండో జంటగా వీళ్లిద్దరు నిలిచారు.

గతంలో న్యూజిలాండ్‌ క్రికెటర్లు అమీ సటర్వైట్- లీ తహుహు ఇదే విధంగా వివాహం చేసుకున్నారు. డేన్‌ దక్షిణాఫ్రికా మహిళా జట్టుకు ఓ టెస్టు, 95 వన్డేలు, 68 టీ-20లకు ప్రాతినిధ్యం వహించింది. 95 వన్డేల్లో 1770 పరుగులు చేసి ఏడు అర్ధ సెంచరీలు చేసిన ప్లేయర్ కూడా! అంతేకాదు వన్డేలో 125 వికెట్లు తీసిన క్రికెటర్‌గా ఆమె నిలిచింది. పలు మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన కాప్‌కు ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు ఉంది. దక్షిణాఫ్రికాలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు వుండవు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్వలింగ వివాహాలు చట్టబద్ధమేనన్న విషయం తెలిసిందే!

Related News