సోనమ్ మంగళసూత్రం ఎక్కడ?

ఫ్యాషన్ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌కపూర్ వార్తల్లోకి వచ్చేసింది. రీసెంట్‌గా వైవాహిక జీవితంలోకి ఎంటరైన ఈ అమ్మడు, ప్రస్తుతం షూటింగులతో బిజీగా వుంది. నార్మల్‌గా అయితే మ్యారేజ్ తర్వాత నాలుగైదు నెలలు గ్యాప్ ఇచ్చి షూట్‌కి చాలామంది హీరోయిన్లు హాజరైన సందర్భాలున్నాయి. ఈ విషయంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే తాను డిఫరెంట్ అంటోంది సోనమ్‌కపూర్.

ఇక అసలు విషయానికొస్తే.. సోనమ్, తన మంగళసూత్రాన్ని బ్రేస్‌లెట్ మాదిరిగా డిజైన్ చేయించుకుని చేతికి పెట్టుకుంది. అంతేకాదు మంగళసూత్రంపై ఇద్దరిరాశులు లియో, జెమిని చిహ్నాలు కూడా వున్నాయి. కేన్స్‌కి వెళ్లే ముందు ఈ విధంగా చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంచక్కా వాటితోనే ఫోటోలకు పోజులిచ్చింది.

భర్తపై ప్రేమ సరే, మెడలో వుండాల్సిన తాళిబొట్టుని ఇలా చేతికి కట్టుకోవడం ఏంటంటూ సినీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి సోనమ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో?

 

Related News