సోనాలీ ఫైన్.. వదంతులు నమ్మొద్దు

క్యాన్సర్ వ్యాధికి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలీ బెంద్రే మరణించిందని అంటూ బీజేపీ నేత రామ్ కదమ్ చేసిన ట్వీట్లను సోనాలీ భర్త గోల్డీ బెహెల్ ఖండించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతతో వినియోగించాలని, తన భార్య గురించి వస్తున్న వదంతులను నమ్మరాదని ఆయన కోరారు. ఇది తన విన్నపమని అన్నారు.

ఇలాంటి వార్తల వల్ల కొందరి మనోభావాలు దెబ్బ తింటాయని ట్వీట్ చేశారు. కాగా-సోనాలీపై తను చేసిన ట్వీట్ల పట్ల రామ్ కదమ్ ఆ తర్వాత విచారం వ్యక్తం చేస్తూ..తన పొరబాటుకు క్షంతవ్యుడినని పేర్కొంటూ మొదట తను చేసిన ట్వీట్‌ను డిలిట్ చేశారు. సోనాలీ బెంద్రే త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని ఆయన కోరాడు.

READ ALSO

Related News