ఔను.. నేను నక్సలైట్‌నే!

ప్రముఖ నటుడు, రచయిత, సామాజిక వాది, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. వామపక్ష భావాల్ని ఎక్కువగా వ్యక్తీకరించే గిరీష్.. ఇటీవల కాలంలో శాఫ్రానిస్ట్ పాలిటిక్స్‌కి వ్యతిరేకంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హంతకుల హిట్ లిస్ట్‌లో యితడు కూడా ఉన్నట్లు సిట్ పోలీసులు ధృవీకరించారు కూడా. అయినా.. తన భావజాలం విషయంలో రాజీ పడేది లేదంటున్న గిరీష్ కర్నాడ్.. అదే దూకుడు కంటిన్యూ చేసుకుంటున్నారు. ఆ కోవలోనే.. ఆయన మరో ‘సాహసం’ చేశారు.

గౌరీ లంకేశ్ తొలి వర్ధంతి నేపథ్యంలో బెంగళూరులో జరిగిన ర్యాలీలో ‘నేనూ అర్బన్ నక్సలైట్‌నే’ అంటూ ప్లకార్డు చేయించుకుని మెళ్ళో వేసుకున్నారు. అక్కడున్న వారందరినీ ఆకర్షించడంతో పాటు.. ఈ విషయం పోలీసుల దాకా చేరింది. ఒక లాయర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వామపక్ష భావజాలంతో మోదీని ఢీకొంటున్న మరో నటుడు ప్రకాష్ రాజ్ కూడా గిరీష్ కర్నాడ్‌కి బాసటగా నిలబడ్డారు.

Related News