రెండో పెళ్లి.. సునీత క్లారిటీ!

ఎదుటివాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి మీకెందుకంత వ్యామోహం అని డైరెక్ట్‌గా క్వశ్చన్ చేశారు సింగర్ సునీత. వివాదాస్పద కామెంట్లకు దూరంగా ఉండే సునీత ఈసారి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈమేరకు సింగిల్ లైన్‌లో బరస్ట్ అయ్యారు. సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరుగుతోంది. ఈ అంశం మీదే ఆమె కాస్త తీవ్రంగా స్పందించింది. ”నాకు అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇన్ని ఫోన్లు, మెసేజీలు రాలేదు. నా పెళ్లి మీద మీకెందుకింత తొందర..? నేను చెప్పేవరకూ ఆగండి. అయినా నేనెందుకు క్లారిటీ ఇవ్వాలి.. నా పెళ్లి నా ఇష్టం.” అంటూ.. ఫేస్ బుక్ లైవ్‌లోకొచ్చి సున్నితంగా కడిగిపారేసింది.

ఆమె కట్టూ.. బొట్టూ, మాట.. పాట తీరు ఆమెకు చాలామంది అభిమానుల్ని సంపాదించిపెట్టాయి. అటు సోషల్ మీడియాలోనూ సునీతకు పెద్ద ఫాలోయింగే ఉంది. ఇప్పటివరకు వందలకొద్దీ పాటలు పాడిన సునీత… డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఫుల్ బిజీ. రాశి, భూమిక, అనుష్క, జ్యోతిక, ఛార్మి, మీరా జాస్మిన్, లైలా, సోనాలీ బెంద్రే, సౌందర్య, రిచా గంగోపాధ్యాయ్, శ్రియ, స్నేహజెనీలియా, కత్రినా కైఫ్, తమన్నా, ఇలియానా, కమిలినీ ముఖర్జీ, త్రిష, నయనతార వంటి హేమాహేమీ హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారుకూడా. 40 ఏళ్ల వయసున్న సునీతకు 20 ఏళ్ల కుమారుడు ఆకాష్, 17 ఏళ్ల కుమార్తె శ్రేయ ఉన్నారు. 19 ఏళ్ల వయసులో కిరణ్(లక్కీ) ను ఆమె వివాహమాడిన ఆమె, కొన్ని మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లలతో జీవిస్తున్నారు.

 

Singer Sunitha Clarifies on Second Marriage

#SingerSunitha Clarifies on Second Marriage

Posted by Tolivelugu on Friday, July 20, 2018

Related News