నయన గురించి నిజమేనా?

సౌత్ స్టార్ నయనతార పెళ్లి గురించి లేటెస్ట్ న్యూస్. శింబు- నయనతార ప్రేమ, ఆపై విడిపోవడం మీద రకరకాల వార్తలు గతంలో హంగామా చేశాయి. తనకు తెలిసి అందుకు కారణం వేరేగా వుందంటున్నాడు  దర్శకుడు జీటీ నందు. నయనకు పెళ్లయితే ఆమె రోడ్డున పడే ఛాన్స్ వుందని, పెళ్లి చేసుకోకపోతే సీఎం అయ్యే అవకాశం వుందని ఓ జ్యోతిష్కుడు అన్నట్టు తెలిపాడు. నయన్‌తారని శింబు  పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే సరైన కారణమని అంటున్నాడు.

చాన్నాళ్ల కిందట తాను- శింబు తరపున మరో వ్యక్తి కలిసి ఓ జ్యోతిష్కుడిని కలిశామని, శింబు-నయన్‌ల జాతకాలను పరిశీలించిన సదరు జ్యోతిష్కుడు పై విషయం చెప్పాడని అంటున్నాడు. దీనిపై కోలీవుడ్‌లో చర్చ మొదలైపోయింది. అందుకేనా నయనతార మ్యారేజ్ చేసుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై నయన, శింబులు ఏమంటారో చూడాలి.

Related News