అప్పుడే వద్దంటున్న హీరోయిన్ శ్రియ

మ్యారేజ్ తర్వాత కొత్త సినిమా చేస్తున్న హీరోయిన్ శ్రియ.. తన ఫ్యూచర్ ప్లాన్ బయటపెట్టింది. రష్యాకు చెందిన తన ప్రియుడు ఆండ్రీ కోషివ్‌ను మ్యారేజ్ చేసుకున్న ఆమె, కొంతకాలం తన భర్తతో కలిసి ఫారెన్ టూరేసింది. రీసెంట్‌గా కొత్త సినిమాకి ఓకే చేసిన ఈ బ్యూటీ, ఆ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంలో తన మనసులోని మాటను మీడియాతో పంచుకుంది. మ్యారేజ్, పిల్లల గురించి ప్రధానంగా ప్రస్తావించింది.

తల్లి అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు రిప్లై ఇచ్చేసింది. ఇప్పుడు తల్లి అవ్వాలనే ఆలోచన‌ అస్సలులేదని, మరో 20 సినిమా పూర్తయ్యేవరకు పిల్లల్ని వద్దని, అలాగని.. పెళ్లి అనేది తన సినీ కెరీర్‌కు అడ్డంకాదని తేల్చేసింది. ఈ లెక్కన కొంతకాలంపాటు గ్లామర్ ఇండస్ర్టీలో శ్రియ హంగామా చేయనుందన్నమాట. కోలీవుడ్‌లో ఆమె నటించిన ‘నగరసూరన్‌’ త్వరలో విడుదల కానుంది. మరోవైపు ‘వీర భోగ వసంతరాయులు’ చిత్రంలోనూ నటిస్తోంది.

Related News