శ్రియ ‘స్పెషల్’ లుక్

నారా రోహిత్ – శ్రియ జంటగా రానున్న ఫిల్మ్ ‘వీరభోగ వసంతరాయలు’. ఇప్పటికే నటీనటుల ఫస్ట్‌లుక్‌ రాగా, తాజాగా హీరోయిన్ శ్రియ బర్త్‌డే సందర్భంగా స్మాల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో వెరైటీగా కనిపిస్తోంది ఈ అమ్మడు. సూట్‌లో అదిరిపోయింది శ్రియ.

సింపుల్‌గా చెప్పాలంటే ఏదో టెన్షన్‌లో వున్నట్లు శ్రియ కనిపిస్తోంది. దీంతో సినిమాలో ఆమె రోలేంటి? అంటూ చర్చించుకోవడం మొదలైంది. అంతకుముందు శ్రియ‌, నారా రోహిత్‌, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు లుక్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రానున్నఈ ప్రాజెక్ట్‌కి ఇంద్రసేనా ఆర్‌ డైరెక్టర్.

Related News