‘అర్జున్ రెడ్డి’ మరీ పచ్చిగా..!

తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ తమిళ్, హిందీ వెర్షన్స్ కోసం కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసిన సందీప్ వంగా హిందీ రీమేక్ ప్రాజెక్టుని టేకప్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా ఆ సినిమా రెడీ అవుతోంది. ఇటు క్రియేటివ్ డైరెక్టర్ బాల నేతృత్వంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా తమిళ్ ‘అర్జున్ రెడ్డి’ తయారవుతున్నారు.

‘వర్మ’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసిన బాల.. ధృవ్‌కి మంచి డెబ్యూ కోసం బాగా కసరత్తు చేస్తున్నాడు. మూడు రోజుల కిందటే షూటింగ్ పార్ట్ ముగిసినట్లు యూనిట్ అనౌన్స్ చేసింది. హీరో బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్, ట్రైలర్, మ్యూజిక్ అన్నీ ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. కాకపోతే.. ఈ ప్రయత్నం లీకువీరుల బారిన పడి అభాసుపాలైంది.

ధృవ్ హీరోగా మేఘా చౌదరి హీరోయిన్‌గా వస్తున్న ‘వర్మ’ మూవీ ఫస్ట్ లుక్ ఇదేనంటూ ఒక ‘రా’ పిక్ సోషల్ మీడియాలో తళుక్కుమంది. బైక్ మీద పూర్తి రెక్లెస్ లుక్స్‌తో కనిపిస్తున్న ధృవ్.. మరీ పచ్చిగా వున్నాడు. సినిమాలో ధృవ్ క్యారెక్టర్‌ని రిప్రెజెంట్ చేసే ఖచ్చితమైన లుక్ ఇది. కాకపొతే.. ఇది ఒరిజినలా లేక ఫ్యాన్ మేడ్ పిక్చరా అనే డౌట్స్ కూడా లేకపోలేదు.

Related News