చంద్రబాబుకు శివసేన షాక్!

మోదీ సర్కారు మీద అవిశ్వాసం పెట్టి.. దేశవ్యాప్త మద్దతు కూడగడుతున్న టీడీపీకి శివసేన నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఓటెయ్యాలంటూ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది శివసేన. చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోడానికి శ్రమించాలన్నది శివసేన తాజా సంకల్పం. బీజేపీ సుప్రీం అమిత్ షా జరిపిన వరుస మంతనాల అనంతరం సేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.

ఉండడానికి ఎన్డీఏలో ఉన్నా.. విధానపరంగా బీజేపీని, మోదీ సర్కారును తీవ్రంగా విభేదిస్తూ వచ్చింది శివసేన. 2019 ఎన్నికల్లో బీజేపీతో ప్రమేయం లేకుండా సొంతంగా పోటీ చేస్తామంటూ ఇప్పటికే శివసేన తీర్మానించుకుంది. ఆ పార్టీ ఇప్పుడీ విధంగా ‘యూటర్న్’ తీసుకోవడం కొత్త రాజకీయ చర్చకు తావిచ్చింది. లోక్ సభలో 18 మంది ఎంపీల బలమున్న శివసేన మద్దతు కూడగట్టడంలో మోదీ సర్కార్ అలా సక్సెస్  అయిందన్న మాట!

READ ALSO

Related News