ఇదేనా దేశభక్తి, సిద్ధుపై శివసేన విమర్శలు

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి సిద్దూపై మండిపడింది శివసేన మౌత్ పీస్ సామ్నా. ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి తన నకిలీ దేశభక్తిని నిరూపించుకున్నారని ఎద్దేవాచేసింది. పాక్‌పై అంత ప్రేముంటే అక్కడికే ఎన్నికల్లో పోటీ చేయాలని సిద్ధూకు ఓ సలహా ఇచ్చేసింది. సిద్ధూపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని దుయ్యబట్టింది.

ఇప్పుడు సిద్ధు కాంగ్రెస్ పార్టీ వ్యక్తని, అతని సొంత పార్టీ బీజేపీనే కదా అంటూ? మరి ఆ పార్టీ ఏం సంస్కారం నేర్పిందంటూ బీజేపీపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది శివసేన. ఒకప్పుటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను మోడీ ఆలింగనం చేసుకుంటే గొప్ప చర్యగా అభివర్ణించినప్పుడు, ఇప్పుడు సిద్ధూను మాత్రమే ఎందుకు బాధ్యులను చేయాలంటూ మోడీపైనా విమర్శలు గుప్పించింది.

Related News