మోడల్‌తో షార్క్‌ల జలకాలాటలు.. ఆపై

తాను మరింత అందంగా కనిపించాలని కోరుకుంది ఓ మోడల్. డేంజర్ అని వినలేదు.. షార్క్‌ల మధ్య ఫోటోషూట్ కోసం వెళ్లింది. అక్కడున్న ఓ షార్క్‌ ఆమె చేయి కొరికేసింది. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టడం ఆమె వంతైంది. కాలిఫోర్నియా కు చెందిన మోడల్‌ కేటరిన జరుస్కీ.. వెకేషన్‌ నిమిత్తం తన ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి బహమస్‌లోని స్టాన్లీ‌కే ద్వీపానికి వెళ్లింది. లొకేషన్ చూసి ముచ్చటపడిన జరుస్కీ, ఫొటోషూట్‌‌కి ప్లాన్ చేసింది.

షార్క్‌ల మధ్య సరదా ఈత కొడుతూ ఫొటో దిగాలని భావించి ఇంకా లోపలికి వెళ్లింది. అక్కడేవున్న ఓ భారీ షార్క్‌.. కేటరినాపై ఎటాక్ చేసింది. ఆమెని నీళ్ల అడుగుకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. మొత్తానికి షార్క్‌ నోటి నుంచి చేయి విడిపించుకుని ఈదుకుంటూ బయటపడింది. ఆ తర్వాత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను కేటరినా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో అప్‌లోడ్ చేసింది. ప్రాణాలతో బయటపడ్డాను.. నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పుకొచ్చింది. కొద్దిరోజుల కిందట ఆస్ర్టేలియా సమీపంలో కూడా ఇలాగే జరిగింది. ఫ్రెండ్స్‌‌తో కలిసి సముద్రంలోకి వెళ్లిన ఓ యువతిపై షార్క్ దాడి చేసిన విషయం తెల్సిందే!

READ ALSO

Related News