2పాయింట్0 షాకింగ్

ప్రముఖ దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘2పాయింట్0’. గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర జాప్యం జరిగి ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రజనీ ఫ్యాన్స్‌ తోపాటు యావత్ సినీ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అయితే, దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. విఎఫ్ఎక్స్ కంపెనీలు కచ్చితంగా ఫలానా తేదీకి పని పూర్తి చేసి ఇస్తామని ప్రామిస్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. రజనీ, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాను అత్యంత అధునాతన సాంకేతికత ఉపయోగించి తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని శుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.

Related News