ఏడుగురు మావోలు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లో మావోలు ఇద్దరు ప్రజాప్రతినిధులను మట్టుబెట్టిన నేపధ్యంలో ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఛత్తీస్ ఘడ్ లోని మావోల ప్రాబల్యమున్న అటవీ ప్రాంతంలో నిర్వహించిన కూంబింగ్ లో పెనుముప్పే బయటపడింది. పోలీసులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా మావోయిస్టులు పెట్టిన మందుపాతరలు(పైపు బాంబులు) ను పోలీసులు కనుగొన్నారు. ఈ కూంబింగ్ లో ఏడుగురు మావోలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరనుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Related News