ఎన్టీఆర్ పోలికలతో ఎవరైనా ఉన్నారా? రూ. 10 లక్షలిస్తా

తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే..దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ సినిమాకు సంబంధించి వెరైటీ ప్రమోషన్ పనులకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా..లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కలుసుకున్నప్పుడు..ఆ వయస్సులో ఆయన ఎలా ఉండేవారో..అలాంటి పోలికలు కలిగి ఉన్న వ్యక్తి వివరాలు తెలియజేయాలని తన ట్విటర్ ద్వారా కోరాడు. అందుకు సంబంధించిన వీడియోను’  laksmisntr@gmail.comకి  పంపించండి..రూ. 10 లక్షలు బహుమతిగా ఇస్తా అని పేర్కొన్నాడు. ఇటీవల చంద్రబాబునాయుడు పాత్రకు గాను ఆ పోలికలతో ఉన్న వ్యక్తి వీడియోను షేర్ చేసి..అతని గురించి వివరాలు తెలిపినవారికి లక్ష రూపాయలిస్తానని వర్మ ప్రకటించడం, అలా డీటెయిల్స్ పంపిన  రోహిత్ అనే వ్యక్తికి తను లక్ష పంపినట్టు   ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Related News