100మందితో కార్పొరేట్ సేన

ఎస్సీ వర్గాలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తూర్పు గోదావరిజిల్లాకు చెందిన పలువురు బుధవారం జనసేన పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎస్సీలు కూడా ఎదగాల్సిందే అన్నారు. ఈ వర్గాలకు సంబంధించి వందమంది ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్‌ని తయారు చేస్తానని తాను మాటిస్తున్నానని చెప్పారు. టీడీపీ గానీ, వైసేపీ గానీ ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ పారిశ్రామికవేత్తలను తయారు చేశాయో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ‘ దెబ్బ తిన్నా సరే ! పోరాటం చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. నా తుది శ్వాస వరకు పోరాటం ఆగదు ‘ అని పవన్ పేర్కొన్నారు.
”ఎస్సీల నుంచి 100 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని తయారు చేస్తా”నన్న పవన్ హామీపై చర్చ మొదలైంది. కులానికో ‘భవన్’ కట్టిస్తాననో.. కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాననో మూస హామీలిచ్చే సాంప్రదాయ రాజకీయ పార్టీల్లా కాకుండా.. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రతిపాదన కాస్త విభిన్నంగా వుంది. కులాల్ని ఎదగనివ్వడం అంటే ఏమిటో చేసి చూపిస్తానన్న పవన్ స్ట్రాటజీ నిజంగానే గొప్పగా ఉందని జనసేన క్యాడర్ చెబుతోంది.

Related News