ఒక్క సినిమాకి.. 280 కోట్లు!

అవును.. ఒక్క సినిమాకి 4 కోట్ల అమెరికన్ డాలర్లు అంటే.. దాదాపు 280 కోట్ల రూపాయలు దండుకుంటోంది హాలీవుడ్ గ్లామరస్ యాక్ట్రెస్ స్కార్లెట్ జోహన్సన్. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన తాజా జాబితా చెప్పిన బరువైన నిజం ఇది. ప్రపంచంలోకెల్లా కాల్షీట్ల ద్వారా అత్యధికంగా సంపాదించే నటీమణుల లెక్క తీసిన ఫోర్బ్స్ వాళ్ళు తాజాగా టాప్10 కాస్ట్‌లీ హీరోయిన్ల లిస్టును రూపొందించారు. గత ఏడాది ఈ జాబితాలో చోటే దక్కించుకోలేకపోయిన స్కార్లెట్ జోహన్సన్.. ఈసారి మొట్టమొదటి స్థానాన్ని ఆక్యుపై చేసింది.

ఒక్కో సినిమాకి ఈమె వసూలు చేసే రొక్ఖం అక్షరాలా 40.5 మిలియన్ డాలర్లట. రూపాయల్లో అయితే ఇది 280 కోట్లకు పైమాటే! బ్లాక్ విడో పాత్ర ద్వారా కొత్తగా వచ్చిన క్రేజ్ వల్లే ఈ అమ్మడు ఇంత ఖరీదెక్కిందట. ఈమె నటించిన ఎవెంజర్స్2, ఇన్ఫినిటీ వార్ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇక.. రెండో స్థానంలో ఏంజెలినా జోలీ నిలబడింది. ఈమె రెమ్యునరేషన్ 28 మిలియన్ డాలర్లు. గతంలో టాప్ 10లో ప్లేస్ దక్కించుకున్న బాలీవుడ్ బొమ్మ దీపికా పదుకొనె అడ్రస్ ఈసారి గల్లంతయ్యింది.

Related News