ఏడు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు, కాశ్మీర్‌కు సత్యపాల్

ఎట్టకేలకు ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తరాఖండ్‌‌కు బేబీరాణి మౌర్య, హర్యానాకు సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, బీహార్‌‌కు లాల్‌ జీ టాండన్‌, గవర్నర్ పాలనలోవున్న జమ్మూకాశ్మీర్‌కు కొత్త గవర్నర్‌ను నియమించింది. బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు సత్యపాల్ మాలిక్‌ను గవర్నర్‌గా నియమించింది. మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్‌, త్రిపురకు కప్తాన్‌ సింగ్‌ సోలంకి, సిక్కిం గవర్నర్‌గా రంగాప్రసాద్‌ బదిలీ అయ్యారు.

Related News