ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏఐసీసీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా తెలంగాణాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమిస్తూ మహారాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. మాజీ కేంద్రమంత్రి జేడీ శీలంను కూడా ఏఐసీసీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ కు అనుసంధానించారు. ఇక ఏపీకి తమిళనాడుకు చెందిన క్రిస్టోఫర్ తిలక్, సీడీ మయ్యప్పన్ లను ఏఐసీసీ కార్యదర్శి పదవులు వరించాయి. ఏఐసీసీ  సంయుక్త కార్యదర్శిగా శశికాంత్ శర్మ, కార్యదర్శిగా మహేంద్ర జోషీని నియమించారు.

Related News