ట్యాక్సీ డ్రైవర్‌గా సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి లేటెస్ట్ న్యూస్. హాలీవుడ్‌లో హిట్టయిన థ్రిల్లర్ మూవీ ‘కొలాటెరల్’ ఆధారంగా టాలీవుడ్‌లో ఓ ఫిల్మ్‌కి ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్‌లో టామ్ క్రూయిజ్ ప్రధానపాత్ర పోషించగా, తెలుగులో కొన్ని పాత్రల నేపథ్యంలో దీన్ని నడిపిస్తారని తెలుస్తోంది. ఇందులో సమంత ట్యాక్సీ డ్రైవర్‌ పాత్ర పోషిస్తుందని టాక్. ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్ మూవీ కావడంతో స్టోరీ విన్న వెంటనే సమంత ఓకే చేసిందని అంటున్నారు. ఈ చిత్రం ద్వారా అర్జున్ రెడ్డి ఫేం సందీప్‌రెడ్డి శిష్యుడు గిరిసయ్య డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. అరుణ్ ఆదిత్‌తో పాటు నవదీప్, మురళీశర్మ, సాయిచంద్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఇదిలావుండగా.. వచ్చే మార్చి నుంచి గ్లామర్ ఇండస్ర్టీకి సమంత గుడ్ బై చెప్పేస్తోందని వచ్చిన వార్తల నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్ వెలుగులోకి రావడం విశేషం. సినిమాలకు సమంత దూరం కానుందన్న వార్తలపై స్పందించాడు నాగచైతన్య. ఈ వార్తలో ఏమాత్రం నిజంలేదని, సమంతకి సినిమాలంటే చాలా ఇష్టమని అన్నాడు. గ్లామర్ ఇండస్ర్టీకి ఆమె దూరమయ్యే ఛాన్స్ లేదని సింపుల్ గా తేల్చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో యుటర్న్, తమిళంలో ‘సీమరాజా’ సినిమాలతో బిజీగావుంది సామ్. ఇదికాకుండా నిన్ను కోరి ఫేమ్ శివ డైరెక్షన్‌లో నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేయబోతోంది.

Related News