పెళ్లిరోజు చైతూకి ఇచ్చే కానుక అదే

నాగచైతన్య- సమంత మ్యారేజ్ అయి దాదాపు వచ్చేనెల ఆరుకి ఏడాది కావస్తోంది. ఈ క్రమంలో ఈ జంట ప్రిపరేషన్ ఏంటి? ఈసారి సెలబ్రేషన్స్ ఎక్కడ? ఇలా రకరకాల ప్రశ్నలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సమంత క్లారిటీ ఇచ్చేసింది. ఆ రోజున చైతూకి ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని సమంతను మీడియా ప్రశ్నించింది.

మేమిద్దరం కలిసి నటించే మూవీ పెళ్లి రోజు (అక్టోబర్ 6న) ప్రారంభం కానుందని, అదే మావారికి తాను ఇచ్చే గిఫ్ట్‌గా భావిస్తున్నానని చెప్పింది. యూటర్న్ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టింది సమంత.

Related News