‘శూర్పణఖ’గా సమంత…!

రంగస్థలం మూవీలో చెర్రీతో కలిసి చేసిన రామలక్ష్మి పాత్ర.. సమంత అక్కినేని కెరీర్‌లో మరపురానిది. ప్రేక్షకుల్ని కూడా రామలక్ష్మి జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్ట్‌గా మరో మెట్టు పైకెదిగిన సమంత.. 2018లో తన కేరీర్ గ్రాఫ్‌ని బాగా దిట్టపర్చుకుంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ సినిమాలతో డిఫెరెంట్ జానర్స్‌ని టచ్ చేసి తన వెర్సటైల్ టాలెంట్‌‌తో సదరు సినిమాల్ని కూడా బతికించింది. ఇప్పుడు అదే కోవలో మరో ఛాలెంజింగ్ రోల్‌ని ఎంపిక చేసుకుంది సమంత అక్కినేని.

ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’ మూవీ షూట్స్ మీదుంది సమంత. దీని తర్వాత.. ఫేమస్ డైరెక్టర్ భార్గవతో కలిసి ఒక ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకుంది. యానిమేషన్ ఫిలిమ్స్‌కి పెట్టింది పేరైన భార్గవ్.. ఒక పౌరాణిక చిత్రం చేస్తున్నారని, అందులో రావణుడి సోదరి శూర్పణఖ పాత్ర కోసం సమంతను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మొదట.. ఈ రోల్ కోసం కాజల్ అగర్వాల్‌ని అప్రోచ్ అయినప్పటికీ.. డేట్స్ లేవన్న కారణం చూపి ఆమె ఎస్కేప్ అయ్యింది.

ఇప్పటికే వెర్సటైల్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న సమంత మాత్రం ‘శూర్పణఖ’ వేషానికి సై చెప్పేసింది. ఇప్పుడు విజయ్ సేతుపతితో కలిసి తను చేసిన ‘సూపర్ డీలక్స్’ మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తున్న సమంత.. ఈ గ్యాప్‌లో ‘శూర్పణఖ’ కోసం ట్రయల్స్ వేస్తోందట!

Related News