సమంత ‘యూటర్న్’ ఫస్ట్‌లుక్

తన తాజా చిత్రం ‘యూటర్న్ ‘ ఫస్ట్‌లుక్ పోస్టర్ని సమంత ట్విటర్‌లో పోస్ట్ చేసింది. శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్ బ్యానర్‌పై కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ రోల్‌‌లో సామ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబరు 13న విడుదల కాబోతున్న ‘యూటర్న్’ తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేరకమైన రెస్పాన్స్ తెచ్చుకుని సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా అని సమంత కామెంట్‌ను పోస్ట్ చేసింది.

Related News