కీర్తిసురేష్.. ‘సామి స్వ్కేర్’ ట్రైలర్

విక్రమ్- కీర్తిసురేష్ జంటగా రానున్న మూవీ ‘సామీ స్క్వేర్’. దీనికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో విక్రమ్ నటించిన హిట్ ఫిల్మ్ సామికి ఇది సీక్వెల్. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో హీరో ఎంట్రీ ఇచ్చాడు. పోలీసు అధికారి గెటప్‌లో స్లిమ్‌గా వున్నాడు విక్రమ్. ‘లైఫ్‌లో ఇక ఎవర్నీ ప్రేమించకూడదు.. నేను నలుగుర్ని ప్రేమిస్తాను’ అంటూ విక్రమ్, కీర్తి చెప్పిన డైలాగ్స్ ఓకే!

ట్రైలర్ కలర్‌ఫుల్‌గా వుంది. సాంగ్స్ లొకేషన్స్ బాగున్నాయి. కాకపోతే అరుపులు ఎక్కువగా వున్నాయని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. తమిళ నటుడు బాబీసింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తమీన్స్ ఫిలిమ్స్ పతాకంపై శిబూతమిన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ థర్డ్ వీక్‌లో రిలీజ్ కానుంది. దీనికి హరి డైరెక్టర్.

Related News