RX100 మూవీకి ఎక్‌స్ట్రా ‘సీన్లు’

పెద్ద విజయం సాధించిన చిన్న సినిమాల జాబితాలో ఎప్పుడో చేరిపోయింది ‘ఆర్ఎక్స్100’. మల్టిప్లెక్స్‌‌ల నుంచి సీ సెంటర్ల దాకా వసూళ్లు ఇరగదీస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. పెట్టుబడి మీద దాదాపు 500 శాతం లాభాలు గడించే ఛాన్స్ వుందన్నది ‘లాంగ్ రన్’ అంచనా. 2018లో ‘ప్రాఫిట్ జోన్’లోకొచ్చిన సినిమాల్లో ఇప్పటిదాకా ఇదే టాప్ అని కూడా తేలిపోయింది. మరీ ముఖ్యంగా నైజామ్ ఏరియాలో ఆర్ఎక్స్100 కొస్తున్న క్రేజ్ లెక్కలకందడం లేదట! 125కి పైగా స్క్రీన్స్‌లో నడుస్తున్నా.. ఆక్యుపెన్సీ రేట్ తగ్గడం లేదని, సెకండ్ వీకెండ్ కోసం మరో 50 స్క్రీన్స్ పెంచే ఆలోచనలో ఉన్నామని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఇటు.. ఆ సినిమాతో బాగా లబ్ది పొందిన డైరెక్టర్, హీరోయిన్లు ఇస్తున్న స్టేట్మెంట్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ ఛాన్స్ వచ్చిందని దర్శకుడు అజయ్ భూపతి అంటుంటే, ప్రభాస్, మహేష్ లతో నటిస్తానంటూ హద్దులు గీసుకుంటోంది హీరోయిన్ పాయల్ రాజపుత్.

READ ALSO

Related News