రూపాయి ‘ఏడిస్తే’…పసిడి కొండెక్కింది

దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ క్షీణించడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల బాట పట్టాయి. అటు-బక్క చిక్కిన రూపాయి కారణంగా దీని ప్రభావం బంగారంపై కూడా పడింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ కనిష్టానికి పడిపోవడంతో దిగుమతి చేసుకునే పసిడి ధర పెరిగింది. సోమవారం మార్కెట్లో రూ. 200 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.31,550 కి చేరింది. అలాగే వెండి ధర కూడా కేజీ రూ. 175  పెరిగి.. రూ. 37,950 పలికింది. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే.. రూపాయి పతనంతో సూచీలు బెంబేలెత్తుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టపోయి.. 37,934 వద్ద కొనసాగగా..నిఫ్టీ 147 పాయింట్ల నష్టంతో 11,442 వద్ద ట్రేడయింది. కొద్దిసేపటికి  డాలర్ తో రూపాయి మారక విలువ కనిష్ట స్థాయి నుంచి కోలుకుని రూ.72.39 గా కొనసాగింది.

READ ALSO

Related News